నర్సాపూర్ పాఠశాల విద్యార్థులకు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్ల పంపిణీ
ఆగస్టు 7: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1,500 విలువ గల స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా సామగ్రి అందించాలని ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి హాజరై విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తీగల రాజయ్య, మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ, గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం ముందుంటూ ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఫౌండేషన్ చైర్మన్ గుమ్మడి కిరణ్–స్వప్న మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి కొట్టే మానస, వార్డు సభ్యుడు గాజుల కొమరయ్య, గాజుల తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గాండ్ల విజయ్, యూత్ సభ్యులు గొర్రె రాజేష్, గాజుల వేణు, గాజుల శేఖర్, శ్రీనివాస్, రాజన్న, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.

