ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యదార్థ సంఘటన

📰 Generate e-Paper Clip

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ పరిశోధనాత్మక కథనం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాదిగల కోసమే మేము పనిచేస్తున్నాము అని చెప్పుకుంటూ తిరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా తెలిసినా తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి దళితులు పెట్టిన కేసులను పోలీసు అధికారులు తీసుకోవడం లేదు దీనికి కారణం ఎవరు ? భారతదేశంలో ప్రత్యేకంగా దళితుల రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అని పోలీస్ అధికారులకు తెలియద భారత దేశ రాజ్యాంగం దళితుల రక్షణ కోసం వారికి కొన్ని హక్కులు కల్పించింది కదా ఆ హక్కులతోనైనా ఎస్సీ కులానికి చెందిన దళితులు చేసే ఫిర్యాదులను ప్రభుత్వ పోలీస్ అధికారులు పరిశీలన చేయాలి కదా. ఖమ్మం జిల్లాలో ప్రముఖ మంత్రి అనుచరులము మమ్మల్ని ఏసీపీ ఏం చేయలేడు సిపి ఏం చేయలేడు అని చెప్పుకొని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక ముఠాకు కొమ్ముకాస్తున్న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుడు ఫిర్యాదు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా కేసు ఫైల్ చేయకుండా బాధితులకు న్యాయం చేయకుండా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది మంత్రి అనుచరులమని చెప్పుకొని ఖమ్మం జిల్లాలో. ఖమ్మం నగరంలో 20 సంవత్సరాల నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వలస వచ్చిన వలసవాదులు ఇక్కడ భూ కబ్జాలు గేదలు అర్ధరాత్రి కబేలాలకు అక్రమంగా తరలించడం. అమాయక ప్రజల భూ కబ్జాలు. పెత్తనాలు.చలాయిస్తూ.భూ దందాలు.చేస్తున్న ఒక్కొక్కరిపై 30పైగా పైగా కేసులు ఉన్నా కూడా పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవట్లేదు అలాగే ఈ మధ్యకాలంలో ఒక దళితుడు వివాదం విషయంలో తన దగ్గర ఉన్న మహేంద్ర తార్ కారును సదరు వ్యక్తులు బలవంతంగా తీసుకోవడం జరిగింది . ఇది ఏంటి అని ప్రశ్నిస్తే మేము మంత్రి అనుచర్లము మీ దిక్కున చోట చెప్పుకోండి మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ విషయమై ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదుదారులకు ఇంతవరకు న్యాయం చేయని పోలీస్ అధికారులు ఒక మూడు నెలల క్రితం ఇలాంటి కేసే ఒకటి ఎఫ్ఐఆర్ చేసి ఒక వ్యక్తిని అక్రమంగా రెండు నెలలు జైల్లో పెట్టడం జరిగింది అంటే ఇక్కడ దళితులకు ఎస్సీ మాదిగోల్లకు ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయమా ఈ స్టేషన్లో ఈ పద్ధతి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే దళితులుగా పుట్టిన వాళ్లకు కార్లు ఉండకూడదా అనేది తెలియని విషయం మరో విషయం ఏంటంటే పోలీసు అధికారులు బాధితుడు వెళ్లి కలవగా మీ నాన్న పెద్ద 420 నీకు కార్ ఎక్కడిది రా అని కించపరిచినట్టు మాట్లాడడం కోస మెరుపు ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారుల మీద గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అయినా కూడా ఖమ్మం జిల్లా సిపి కానీ ఖమ్మం రూరల్ ఎసిపి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకిలా జరుగుతుంది . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రిగా ఉన్న ఇలాకలొ ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి దళితుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు అదే దళితులు మాదిగలు ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోవటం లేదు ఫిర్యాదును తీసుకోవడం లేదు కారణం ఏంటి ఎందుకు ఒక వర్గాన్నిలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సమాజంలో మాదిగ కులానికి చెందినవారు వాళ్లు బతకకూడదా అంటే మాదిగ కులంలో పుట్టటం వాళ్ళు చేసిన పాపమా సమాజంలో వాళ్ళు ఉండకూడదా సమాజంలో వారికి ఒక న్యాయం వేరే వారికి ఒక న్యాయమా . మరో విషయం ఏంటంటే బాధితుడిని కించపరుస్తూ బాధపెడుతున్నారు ఎందుకిలా జరుగుతుంది ఇకనైనా సదురు ఏసిపి రూరల్ ఏసిపి ఈ విషయాన్ని ఈ సంఘటనను పరిగణంలోకి తీసుకొని ఎస్సి మాదిగ బాధితుడికి న్యాయం చేయాలని పొలిటికల్ పవర్ యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాము కొసమెరుపు ఏంటంటే మీ నాన్న పెద్ద 420 నీకు కార్ లేదు ఏం లేదు పోరా బయటికి అని పోలీస్ అధికారులు బాధితుడిని అనడం కోస మెరుపు బాధితుడు తనకు జరిగిన బాధను నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకునే పనిలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము పేదల పక్షపాతులము పేదలకు మాత్రమే న్యాయం చేస్తాము పేదలకే పని చేస్తాము అని చెప్పుకొని ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు కనిపించడం లేదా వారికి తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఏం సందేశం ఏం భరోసా కల్పిస్తున్నట్టు మరో విషయం ఏంటంటే పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రతినిధి వెళ్లి ప్రశ్నించగా మా స్టేషన్ లో మాకు అన్ని తెలుసు మేము కేసు పెట్టాలో పెట్టకూడదో మాకు చెప్పటానికి మీరు ఎవరు. ముందు మీరు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళండి అని అనటం కోస మెరుపు మీడియా వ్యక్తివి నీ మీద అక్రమ కేసు పెట్టాల్సి ఉంటుంది అని బెదిరిస్తున్నారు , బాధితుల సమస్యలు తీర్చడానికి వారికి న్యాయం చేయటానికే కదా పోలీసు వారు ఉన్నది కాదంటారా

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

భద్రాద్రి కొత్తగూడెం రెవెన్యూ శాఖలో సమయపాలన కరువు! ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు తహసీల్దార్లు? ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు.. కింది స్థాయి అధికారుల తీరుతో కలెక్టర్ కార్యాలయ ప్రతిష్ఠకు భంగం...

భద్రాద్రి కొత్తగూడెం: పొలిటికల్ పవర్ ప్రతినిధిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి కొందరు అధికారుల పనితీరు, సమయపాలన, విధి నిర్వహణపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం...

పేద ప్రజల గుండె చప్పుడు ‘చల్లా కృష్ణన్న’.. బాధితుడికి తక్షణ ఆర్థిక సాయం! – మంత్రి పొంగులేటి అనుచరుడు తుంబురు దయాకర్ రెడ్డి సూచనతో రంగంలోకి చల్లా – “ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ...

 ఖమ్మం (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - పాలేరు నియోజకవర్గ ప్రతినిధి): ఆపదలో ఉన్న పేదలకు ‘అక్షయ పాత్ర’లా మారుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలో సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు...

మాదిగ జాతి సంక్షేమమే ధ్యేయం.. కోట నారాయణపురంలో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీ నియామకం! – పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జోరందుకున్న సంఘటనలు – ఖమ్మం రూరల్ మండలం...

  ఖమ్మం జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్. శివకుమార్, నవంబర్ 02):మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమం, ఐక్యతే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పోరాటాల...
error: Content is protected !!