ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికత*ఆలయాల పవిత్రతను కాపాడేదెవరు?.ఆలయ పరిసరాల్లో చెత్త చేదారాలతో దుర్గంధం*

*ఆలయాల పవిత్రతను కాపాడేదెవరు?.ఆలయ పరిసరాల్లో చెత్త చేదారాలతో దుర్గంధం*

📰 Generate e-Paper Clip

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ.పాండు రంగారావు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ : జవహర్ నగర్ :

స్థానిక గబ్బిలాలపేటలోని ఈదమ్మ – ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ధూప, దీప నైవేద్యాలతో పూజలు అందుకోవాల్సిన ఆరాధ్యదేవతల ఆలయాల ముందు కుళ్లిపోయిన వ్యర్థపదార్థాలు, తడి పొడి చెత్త దర్శనమిస్తుండటంతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు చెందిన కొందరు తమ ఇళ్లలోని తడి పొడి చెత్తను తీసుకొచ్చి ఆలయాల ముందు పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు.

హిందూ ఆరాధ్యదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించే మన సంప్రదాయానికి ఆలయాల ముందు చెత్తను వేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇకనైనా ప్రజలు ఆలయాల ముందు చెత్త వేయకుండా సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

 

ఈ సమస్యపై గుడి కమిటీ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆలయాల పరిసరాల్లో చెత్త తొలగించి, చెత్త వేస్తున్న వారిపై అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు సవినయంగా కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!