స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు
అనపర్తి: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తిలోని నారాయణ ఇ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో చిన్నారులకు జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ పోటీని ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం అలీషా, ఇ-కిడ్జ్ ఆర్‌అండ్‌డీ హెడ్ సునీత, కో-ఆర్డినేటర్ హరిత పాల్గొన్నారు. చిన్నారులు వివిధ జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించారు. దేశం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుల గురించి ఈ తరం పిల్లలకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిన్నారులు తమ వేషధారణలోని ప్రత్యేకతలను చిట్టిచిట్టి మాటలతో చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. దేశభక్తి, జాతీయ నాయకుల త్యాగాలపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నారాయణ ఇ-కిడ్జ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రిన్సిపాల్ లిఖిత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
