ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వర్షాలు లేక గార్ల పెద్ద చెరువు కన్నీరు కారుస్తున్న దృశ్యం

వర్షాలు లేక గార్ల పెద్ద చెరువు కన్నీరు కారుస్తున్న దృశ్యం

📰 Generate e-Paper Clip

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                    మహబూబాబాద్ జిల్లా :   గార్ల: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో, మహబూబాబాద్  జిల్లా గార్ల మండల గార్ల  పెద్ద చెరువు నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయి వెలవెలబోతోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన చెరువు నేడు నీటి కోసం ఎదురుచూస్తున్న దుస్థితికి చేరుకుంది. చెరువు పరిసరాల్లోని భూములు ఎండి పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.                                      రైతన్నకు ప్రకృతి అనుకూలిస్తేనే పంట పండుతుంది. కానీ ఈ ఏడాది వరుణుడు ముఖం చాటేయడంతో సాగు పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. చెరువులు నిండకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.                                 “దేవుడు ఉండి కూడా రైతుల కష్టాలను చూడలేకపోతున్నాడా?” అనే ఆవేదన రైతుల హృదయాల్లో వ్యక్తమవుతోంది. పంట కోసం ఆశగా పొలాన్ని చూస్తున్న రైతు కళ్లలో ఇప్పుడు వాన కోసం ఎదురుచూపే కనిపిస్తోంది.                 అయ్యా వాన దేవుడా… ఇప్పటికైనా కనికరించు!గార్ల పెద్ద చెరువును నీటితో నింపు….            రైతుల పొలాలను పచ్చగా మార్చు….            రైతన్న కష్టాలను తొలగించి వారి కుటుంబాల్లో ఆనందం నింపు. వర్షాలు సమృద్ధిగా కురిసి గార్ల పెద్ద చెరువు నిండాలని, రైతుల బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా చేరాలని, పంటలు పండించి రైతుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు చూడాలని స్థానిక ప్రజలు, రైతులు ఆకాంక్షిస్తున్నారు.   “చెరువు నిండితే రైతు బతుకు నిండుతుంది… రైతు బతుకు నిండితే గ్రామం పచ్చగా మారుతుంది.” వరుణ దేవుడు కరుణించి గార్ల పెద్ద చెరువును నింపాలని, రైతన్నకు మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!