ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరాయికంటి నాగన్న నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రాయికంటి నాగన్న నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 16 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన రాయి కంటి నాగన్న నూతన గృహ గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన గృహంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రాయికంటి నాగన్న ను, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల అనేది జీవితంలో ఒక ప్రత్యేకమైన స్వప్నమని, ఆ కలను సాకారం చేసుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ నూతన గృహంలో రాయికంటి నాగన్న, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గృహప్రవేశ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మండల నాయకులతో ఆత్మీయంగా సమావేశమై స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, మోజర్ల సర్పంచ్ శేఖర్, పెద్దమందడి మండల అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, సత్య రెడ్డి, పుట్టమొని నారాయణ, రామచంద్రయ్య గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, బాబు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!