ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కుల పంపిణీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెబ్బేరు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెబ్బేరు మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, విద్యార్థినులకు నోట్‌బుక్కులను పంపిణీ చేశారు. సామాజికవేత్త మంద అక్కమ్మ ఆధ్వర్యంలో, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు కొంతైనా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నోట్‌బుక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నోట్‌బుక్కులు అందుకున్న విద్యార్థులు, పాఠశాలల ఉపాధ్యాయులు కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్, ఎంపీడీఓ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!