-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 16 2026: నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందిస్తున్న పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణకు సంబంధించి తెలంగాణవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థుల కోసం వనపర్తిలోని రేడియంట్ కాన్సెప్ట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో సుమారు 500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అభ్యర్థులకు పరీక్షా పత్రాలు అందజేసి పరీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2005 నుంచి మధుకర్ స్వామి, గద్దె భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. గ్రామీణ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించడం గొప్ప సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్ మాట్లాడుతూ… ఎలిజిబిలిటీ టెస్ట్‌కు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాహిత్య కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, రేడియంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, కవిత, బాలసుబ్రమణ్యం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు శైలజ, సాహితీ కళావేదిక ప్రతినిధులు భైరవ చంద్రశేఖర్, డాక్టర్ భైరవద్ శ్యాంసుందర్, రాంకీ ఫౌండేషన్ ప్రతినిధులు, పరవస్తు ఫౌండేషన్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.




