ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచిలకటోనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిలకటోనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ఎం. అశ్విత మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాములు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు జి. మంజుల పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్తుల్లో దేశభక్తి భావాలను పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!