పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇందులో భాగంగా పెద్దమందడి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దామోదర్‌కు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఫిర్యాదులను స్వీకరించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించడం వంటి సేవలను గుర్తించి దామోదర్‌ను అభినందించారు. నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజలకు సహాయం అందించడం, బాధితులకు అండగా నిలవడం వంటి సేవలు పోలీసుల విధి నిర్వహణలో కీలకంగా ఉంటాయి. అలాగే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాలకు అవసరమైన సహాయం అందించడం, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శించడం వంటి అంశాలను కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. నేరాల దర్యాప్తులో చురుకుదనం చూపించి కేసుల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజా సేవలో ప్రత్యేక ప్రతిభ కనబరచి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడం వంటి సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా “గుడ్ వర్క్ – గుడ్ సర్వీస్”లో భాగంగా ప్రశంస పత్రం అందుకోవడం పట్ల హెడ్ కానిస్టేబుల్ దామోదర్ సంతోషం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించి ప్రోత్సహించిన జిల్లా ఎస్పీ సునీత రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సర్వీస్ లో గతంలో కూడా సేవా ప్రశంస పథకాలు అందుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ ప్రశంస తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని దామోదర్ పేర్కొన్నారు.
