– ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయాన్ని సాధించాలి,
– 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథి తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, శాసన మండలి సభ్యులు డా. పట్నం మహేందర్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు
16.2026.
80వభారతస్వాతంత్ర్యదినోత్సవాన్నిపురస్కరించుకొనిశనివారంవనపర్తిజిల్లాలోనిఐ.డి.ఓ.సిప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యఅతిథి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికనుచదివివినిపించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.స్వాతంత్ర్యసమరయోధులు,ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మెప్మా 45 స్వయం సహాయక సంఘాలకు రూ. 3.75 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకునిమహాత్మాగాంధీసారథ్యంలో సాగిన భారతస్వాతంత్ర్యపోరాటంప్రపంచదేశాలకు ఆదర్శంగానిలిచిందన్నారు.స్వాతంత్ర్యంఅనంతరం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో పేదరికం, అసమానతలు, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై పోరాటానికి పునాది పడిందన్నారు. ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాదులు వేసుకుని దేశం నేడు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగాఅభివృద్ధిచెందుతోందన్నారు.
మన రాజ్యాంగంలో పొందుపర్చినట్లు మనతెలంగాణ ప్రభుత్వంసమాజంలోనిఅన్నివర్గాలకుస్వేచ్ఛ,సామాజిక న్యాయంసమానఅవకాశాలుకల్పించాలనేలక్ష్యంతో ప్రజలకిచ్చినహామీలనునెరవేర్చేక్రమంలో6గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికన ప్రజలందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆరు గ్యారంటీలతో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
మహిళా శక్తి పథకంతో మహిళలకు ప్రయోజనం
మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 76 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి, రూ.156కోట్ల76లక్షలమేరలబ్ధిపొందారనివివరించారు.ఇందిరా మహిళా శక్తి ద్వారామహిళా సంఘాల ద్వారా14బస్సులనుకొనుగోలుచేసిఆర్టీసీకిఅద్దెకుఇవ్వడంద్వారామహిళాసమాఖ్యలకు నెలకు రూ. 19,486 చొప్పున మొత్తం రూ. 2.72 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి 35,660 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 19,865 యూనిఫామ్,లనుకుట్టించి12,931మందివిద్యార్థులకుపంపిణీచేయడంజరిగిందన్నారు. మహిళా శక్తి పథకంకిందరూ.500కేవంటగ్యాస్,అందించేకార్యక్రమం ద్వారా జిల్లాలో 85,383 మందికి 5,12,439 సిలిండర్లుపంపిణీచేసిరూ.15.71కోట్లమేరప్రభుత్వంవ్యయంచేసిందన్నారు.జిల్లాలోని అమరచింత, వనపర్తి మండలాల లో జిల్లా మహిళా సమాఖ్యలకు “కుసుమ్ ప్రాజెక్టు” ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణంకొరకురూ.60లక్షలుమంజూరుకావడంజరిగిందన్నారు. జిల్లాలోవికసిత్,భారత్,గ్రామీణఉపాధిజీవనోపాధికి హామీ మిషన్ (గ్రామీణ) చట్టం 2025 (VB-GRAMG) పథకం కింద 51 అంగన్ వాడి భవనాలు మంజూరు కాగా, వాటిలో ఒకటి పూర్తయి మిగతావి పురోగతిలో వున్నాయన్నారు. అదేవిధంగా 24 అంగన్ వాడి కేంద్రాలు మరియు 42 మహిళా సంఘాల భవనాల నిర్మాణం కొరకు రూ.65 లక్షల నిధులు మంజూరయ్యాయాన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా వుందన్నారు.
వడ్డీ లేని రుణాలు:
జిల్లాలోని 2025-26 సం. కి గాను 9,023 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని ఋణాలు పథకం క్రింద 7 కోట్ల 72 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లా లోని 5 మునిసిపాలిటీల లో 2023-24 2024-25 సంవత్సరాలకు సంబంధించి 956 సంఘాలకు రూ. 3 కోట్ల 16 లక్షలు వడ్డీ లేని ఋణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ:
పేదలకు మెరుగైన వైద్యసేవ, వైద్య సదుపాయాల కల్పన అందించే ఉద్దేశంతో “రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని” రూ.10 లక్షల వరకు ఉచితవైద్యం పొందేలా పేదలకు అందుబాటులోకి తేవడం జరిగిందని, జనవరి 1, 2026 నుండి ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,847 మందికి 18 కోట్ల 97 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉచిత వైద్య చికిత్సలు అందించడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యంరైతుల సంక్షేమంలో భాగంగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా వనపర్తి జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
రైతు భీమా పథకం ద్వారా202526సంవత్సరంలో జిల్లాలో 641 మంది రైతులకు రూ.32.05 కోట్లను వారి కుటుంబాలకు అందించామన్నారు. రైతు భరోసా పథకం కింద 2026 వానాకాలం సీజన్‌లో 1,82,768 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.212.32 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మినుములు, కంది, జొన్న, ఆముదం, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సమావేశాల ద్వారా, కరపత్రాల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, కృత్రిమ మేధస్సు (ఎ1) ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్
సన్నరకం వడ్లకు మద్దతు ధరతోపాటుక్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందిస్తూ, జిల్లాలో గత యాసంగి సీజన్‌లో 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసిరైతులఖాతాల్లోరూ.585.33 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,83,568 రేషన్ కార్డుల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా లో 26,465 కొత్త రేషన్ కార్డుల తో పాటు 1.04 లక్షల మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వనపర్తి జిల్లాలో 5,887 గృహాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 88 శాతం గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో రూ.121 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా తెలంగాణ లో 13 వ స్థానంలో వుందన్నారు.
2వ విడత కింద ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు మంజూరు కాగా మొదటిగా గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రముగ తీర్చిదిద్దుటలో భాగంగా జిల్లాలో 1103 మంది లబ్దిదారులను గుర్తించి వారిలో అర్హులైన 320 మంది లబ్దిదారులకు ఇండ్లు మంజూరు చేయగా వాటిలో 79 ఇండ్లు బేస్ మెంట్ వరకుపూర్తిఅయి24.69శాతంముందంజలోఉన్నదనితెలియజేయడానికి సంతోషిస్తున్నానన్నారు. అదేవిధంగా ప్రభుత్వము ప్రతి నియోజకవర్గమునకు పైకప్పు భర్తీ పథకం కింద 500 ఇండ్లు కేటాయించగా నెలాఖరులోగా అర్హులైన వారందరిని గుర్తించి సంబంధిత లబ్దిదారులకు రూ. 2లక్షలరూపాయల ఆర్ధిక సహాయంఅందించడంజరుగుతుందన్నారు.
గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 87,763 కుటుంబాలకు 20,97,419 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది.ఇప్పటివరకు ప్రభుత్వంరూ.60కోట్ల3లక్షలసబ్సిడిఅందచేయడం జరిగిందన్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 466 విద్యుత్ సరఫరా లేని అంగన్వాడి కేంద్రాలకు రూ.58 లక్షల అంచనా వ్యయంతో పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా కల్పించడం జరిగిందన్నారు. చేయూత పథకం ద్వారా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన పేదలకు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో 70,863 మందికి నెలకు రూ.17 కోట్ల 43 లక్షలు పెన్షన్ కోసం ఇవ్వడం జరుగుతుందన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యంవనపర్తి జిల్లాలో రూ.200 కోట్లఅంచనావ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనపనులువివిధదశల్లోకొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు, పాఠశాల బ్లాకుల నిర్మాణానికి రూ.13.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో 3 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు ఆటల ఆధారిత అభ్యాసం ద్వారా సమగ్ర వికాసం, బాల్య సంరక్షణ మరియు అభ్యాసానికి బలమైన పునాది కల్పించే ఉద్దేశంతో తొలిసారిగా 71 ప్రభుత్వ పాఠశాలల్లోపూర్వప్రాథమికవిద్యనుప్రవేశపెట్టడంజరిగిందన్నారు.వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.47.50 కోట్లు మంజూరై పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.వైద్య రంగంలో ప్రభుత్వఆసుపత్రుల్లోమెరుగైనమౌలికసదుపాయాలు కల్పించడం వల్ల ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగిందన్నారు. వనపర్తి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికిరూ.203.95కోట్లు,పెబ్బేరులోరూ.11.20కోట్లతో,ఆత్మకూరులో రూ.22కోట్లఅంచనావ్యయంతో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులుకొనసాగుతున్నాయనితెలిపారు.ఇంటెన్సిఫైడ్ టిబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా ఏఐ టెక్నాలజీ ద్వారా 1,86,705 టీ బీ అనుమానిత కేసులను గుర్తించగా, వారిలో 319 మందిని నోటిఫై చేయడం జరిగిందన్నారు.వీరికి సి ఎస్ ఆర్ ద్వారా పోషణకిట్లు,ఆర్ధికసహాయంఅందించడంజరుగుతుందన్నారు. 14 సంవత్సరాలు నిండిన 2, 616 మంది బాలికలకు గర్భాశయ ముఖద్వారం కాన్సర్ నివారణకు హెచ్ పివి వాక్సినేషన్ ఇచ్చినందుకు మనజిల్లారాష్ట్రస్థాయిలో6’వర్యాంకుసాధించిందనన్నారు.50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లా జనరల్ ఆసుపత్రికి మంజూరు అయి ప్రారంభానికి సిద్ధంగా వున్నదన్నారు.
వన మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 20.60 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 9.15 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
రహదారులు భవనాలు
జూరాల వద్ద క్రిష్ణ నదిపై వంతెన నిర్మాణం కొరకు సుమారు రూ.121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి పొంది పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.భూ సమస్యల పరిష్కారానికి భూ భారతిరైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు12,501దరఖాస్తులుస్వీకరించి,వాటిలో11,303దరఖాస్తులనుపరిష్కరించినట్లువెల్లడించారు.
ప్రజావాణి
పారదర్శకత, జవాబుదారితనంతో ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుండి రెవిన్యూ డివిజన్ స్థాయికి మరియు మండల స్థాయికి విస్తరించడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రాసెస్ చేసి ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజాపాలన, శాంతిభద్రతలకు ప్రాధాన్యంప్రజల ఫిర్యాదులను మండల స్థాయిలో ప్రతి సోమవారం స్వీకరించి పరిష్కరించేలాప్రజాపాలనకార్యక్రమాన్నివిస్తరించినట్లుతెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, జిల్లాలో 1,785 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బాల్య వివాహాల, రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో 3,566కు పైగా కేసులు పరిష్కరించి ప్రజలకు త్వరిత న్యాయంఅందించినట్లుతెలిపారు.ప్రభుత్వకార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలనే లక్ష్యంతో, వనపర్తి జిల్లా కేంద్రంలోఅద్దెభవనంలోకొనసాగుతున్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ఉమెన్ సేఫ్టీవింగ్, కలెక్టర్ నిధుల ద్వారా పోలీసు పాతనివాస భవనానికిమరమ్మత్తులుచేయించినూతనహంగులతో తీర్చిదిద్ది భరోసా కేంద్రాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చి సేవలందిస్తున్నారన్నారు. వనపర్తి జిల్లా నాగవరం గ్రామం వద్ద జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి రూ.81 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరంవనపర్తిజిల్లాఅభివృద్ధిలో భాగస్వాములైనప్రజలు,ప్రజాప్రతినిధులు,అధికారులు,పోలీసుయంత్రాంగం,న్యాయవ్యవస్థ,పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు డా. పట్నం మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకుతీసుకెళ్లేందుకుఅందరూసమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు ఆశీస్సులు అందిస్తూ, ప్రజలందరికీ మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను పలకరించి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ముఖ్య అతిథి చేతుల మీదుగా 138 మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు రూ. 3.75 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కును అందజేశారు.
అనంతరం ప్రాంగణంలో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.












