ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపకలెక్టర్ చే ప్రశంసా పత్రం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్...

కలెక్టర్ చే ప్రశంసా పత్రం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ మార్కాపురం పట్టణంలోని ఎస్ వి కె పి కళాశాలలో నిర్వహించిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు రకాలుగా 3 దశాబ్దాల నుండి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నందుకు సామాజిక సేవలో ఉన్నవారికి మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఓ ఎస్ డి నవజ్యోతి మిశ్రా డి ఎఫ్ ఓ అబ్దుల్ రవూఫ్ ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి అజయ్ కుమార్ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చేతులు మీదుగా ఉత్తమ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ గా బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రశంసా పత్రం అందుకున్నారు అనంతరం బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా సేవలు చేస్తున్న సందర్భంగా వేరువేరు స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర అవార్డ్స్ తీసుకున్న రెండు గౌరవ డాక్టరేట్స్ పొందిన దాని కంటే ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారుల చేతులమీదుగా తీసుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు ఈ క్రెడిట్ అంతా కూడా మా తల్లిదండ్రులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైన పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీకి మరియు మా తోటి పని చేసే ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్స్ వాలంటీర్స్ అందరికి కూడా అంకితం చేస్తున్నామని తెలియజేశారు ముఖ్యంగా అనాధ శవాలకి అంత్యక్రియలు నిర్వహించడం మిగులు భోజనాలు అన్నార్తులకు పంచడం వృద్ధులకు సేవలు అందించడం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా నిర్వహించడం విద్యార్థిని విద్యార్థులు యుక్తి ముక్తి శక్తితో ముందుకు వెళ్లడానికి శిక్షణ ఇవ్వడం అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నందుకు ఈ ప్రశంసా పత్రం ఇచ్చారన్నారు జిల్లా అధికారులకు అందరికీ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!