భారత్ మాతాకీ జై… వందేమాతరం… వందేమాతరం.. జై తిరంగు జెండాకే .. 
పొలిటికల్ పవర్ పిఎన్9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో సైకిల్ ర్యాలీ పాఠశాల కరస్పాండెంట్ చిత్త రాజశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ చిత్త, ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైయస్సార్ విగ్రహం వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులతో మార్చి ఫస్ట్ చేసుకుంటూ భరతమాత వేషధారణలో వందేమాతరం అనుకుంటూ, భారత్ మాతాకీ జై జైలు చెబుతూ, కలసపాడు పురవీధుల గుండా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

