ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*కరెంట్ ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం*

*కరెంట్ ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం*

📰 Generate e-Paper Clip

 

బాధితులను పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని జింకల నగర్లో అగ్ని ప్రమాదంతో పూరి గుడిసె దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి.సగిలి బాలరాజు అతనిభార్య మరియమ్మ నివాసం ఉంటున్న గుడిసె లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు,రేషన్ కార్డు, బట్టలు, బాండ్లు, బీరువా.టీవీ .ఇంటి సామాగ్రి పూర్తిగా అగ్గిలో పడి కాలిపోయాయి. ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పడంజరిగినది
బాలరాజు అతని భార్య పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరగటంతొ ఒక్కసామానుకుడా తీసుకోలేక పోయారని కట్టు బట్టలతో ఇద్దరు మిగిలారాని .మమ్మల్ని ఆదుకొని న్యాయం చేయండి అంటూ బాధితులు వేడుకుంటున్నారు,
విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
జి.శివకుమార్, మండల కమిటీ సభ్యులు హరి, గురయ్య వెళ్లి పరిశీలించడం జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు ఇ ప్రాంతంలో విధ్యుత్ పోల్స్ ఏర్పాటు చేయమని చెప్పిన పట్టించుకోలేదని గతంలో ఉన్న స్తంభాలను తొలగించడం జరిగిందని
విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించడంతో దూర ప్రాంతం నుండి విద్యుత్ కనెక్షన్ తీసుకోవడంతో వైరు డ్యామేజ్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది దీని పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులు అంటూ వారు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయమని చెప్పినప్పటికీ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం తో నే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!