పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ బి.చంద్రశేఖర్
పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన. ఇవాళ సన్న బియ్యం గురించి ఒకరు. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొకరు ఆరోగ్యశ్రీ గురించి మరొకరు మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆరెస్ రెండూ వేర్వేరు కాదు. అవి నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. బీజేపీ, బీఆరెస్ నాయకులను అడుగుతున్నా. ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని మీరు ఆలోచించారా?. సన్నబియ్యం ప్రతీ పేద ఇంటికి చేరుస్తున్న ఘనత మా ప్రభుత్వానిది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఆనాడు మాట్లాడారు. ఈ 32 నెలల్లో ఏ ఒక్క క్షణమైనా కరెంటు పోయిందా?.ప్రతీ పల్లెలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నది నిజం కాదా?. ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడారు. కానీ సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్న వాస్తవం మీ కళ్ల ముందున్నది.
రైతు భరోసా 2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నాం.36 వేల కోట్లు రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈ వేదికగా కెసీఆర్ కు సవాల్ విసురుతున్నా. రండి శాసన సభలో చర్చిద్దాం.. రైతులకు మేం చేసిన మేలు ఏంటో.. మీరు అన్యాయం ఏంటో చర్చిద్దాం రండి చర్చిద్దాం దేశంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్లు ఖర్చు చేసి రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. తెలంగాణలో రుణం లేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడంలేదా?. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. ఇది మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కాదా?. రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వంలో ఉంది. రెండున్నరేళ్లలో 1 లక్ష 70 వేల కోట్లు రైతులకోసం ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నా. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు ఏ ఒక్కరికైనా ఇచ్చారా?.
కానీ మీ తమ్ముడిగా నేను రెండేళ్లల్లో 7 లక్షల ఇండ్లు మంజూరు చేశా. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు.. ఉండదు. ఒంటరి మహిళలందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది. చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తాం.
అర్హులందరూ దరఖాస్తు చేసుకోండి…. పెన్షన్లు అందించే బాధ్యత మాది. రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో పది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగ యువకులు మాయ మాటలు చెప్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. ప్రతీ ఆరు నెలలకు ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. మాటిస్తే మట్టిలో కలిసే వరకు నిలబడే నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. దుర్మార్గులు రాజకీయం కోసం.. అధికారం కోసం కుట్రలు చేస్తున్నారు. వారి మాయలో పడకండి. పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. మీ హక్కులను కాదనం.. అవకాశాలను తొలగించం.. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ ముందుకు వెళుతున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై చేతబడులు చేస్తారా?
నిజాలు చెబితే మా మహేష్ గౌడ్ కు నోటీసులు ఇస్తున్నారు.అడుగు పెడితే సోషల్ మీడియాలో పెట్టే వాళ్లు తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారు?. వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం మనపై ఉంది. అందుకే ఎల్నినో కరువులోనూ ఎల్లంపల్లి నిండింది. దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుతున్నా. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలో వద్దో అనేది ఆయన చేతిలో కూడా లేదు. అది రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది. రాహుల్ గాంధీ రాముడు అయితే.. జగ్గన్న హనుమంతుడి లాంటి వాడు ఆ రాముడి మాట ఈ హనుమంతుడు ఎప్పుడూ జవదాటడు.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరు ఎన్నికల్లో ఓడినా… కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారు.. తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేడు..అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి.. ఆయనకు మీరు అండగా ఉండాలి.
