ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 2026: మ్మం మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు సింగమలై వెంకటరమణయ్య ఆలోచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా భారతీయుల ఐక్యతతో సాగిన స్వాతంత్ర్య పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులకు ఎవరైనా భంగం కలిగించినా, వాటిని ఉల్లంఘించినా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా కార్యదర్శి చింతల రవిని అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ బెస్త సంజీవరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాబురావు, రాష్ట్ర కార్యదర్శి సంక్ర గణేష్, గౌరవ అధ్యక్షుడు కనకయ్య, మీడియా వింగ్ నీరుడు రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు షారుక్, గుర్రం మనోజ్ కుమార్, రామకృష్ణ ప్రసాద్, నవీన్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సంస్థ ఖమ్మం జిల్లా చైర్మన్ పుచ్చకాయల దేవేందర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!