ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీనివాస్ గౌడ్, వివి గౌడ్, మాచర్ల శ్రీనివాస్ గౌడ్ లు,

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: పెబ్బేరు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మండల గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. అణగారిన వర్గాలకు ధైర్యం, స్ఫూర్తిని అందించిన పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్బా శేఖర్ గౌడ్, ఎస్. సురేందర్ గౌడ్, బసవరాజ్ గౌడ్, ఎన్.ఆర్.జి. గౌడ్, రంగస్వామి గౌడ్, బత్తుల మనోహర్ గౌడ్, శివశంకర్ గౌడ్, పాముపురం శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ గౌడ్, ఈ. రామన్ గౌడ్, వి. ఉమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్, సర్వాయి గౌడ్, రంగాపురం రాజు గౌడ్, సిరివెళ్ల బీచ్‌పల్లి గౌడ్, రమేష్ గౌడ్, చెలిమిళ్ల రాజు గౌడ్, ప్రవీణ్ గౌడ్, కంబాలపురం వెంకటేష్ గౌడ్, అరవింద్ గౌడ్, రణదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు, సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!