ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రజల గుండెల్లో సర్వాయి పాపన్న జ్ఞాపకాలు పదిలం, ఘనంగా జయంతి వేడుకలు

ప్రజల గుండెల్లో సర్వాయి పాపన్న జ్ఞాపకాలు పదిలం, ఘనంగా జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: ప్రజల గుండెల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని బీసి పొలిటికల్ జెఏసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మదనపురం గ్రంథాలయ ఆవరణలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన ప్రజలను ఏకంచేసి, సామాజిక ఆధిపత్యాలకు సవాల్ విరిసిన వీర యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.మొఘల్ పాలకులు,బ్రిటిష్ వాళ్ళు బంధి పోటుగా చిత్రీకరించినా…. ప్రజల జ్ఞాపకాల్లో మాత్రం వీరుడిగా, రాజుగా, విప్లవ యోధుడిగా నిలిచిపోయాడన్నారు. కార్యక్రమంలో రిపోర్టర్ పల్లెపాగ విజయ్, గోపన్ పేట సర్పంచ్ శ్రీ రాములు, మాజీ సర్పంచ్ మన్యం నాయక్, నాయకులు రాజా గౌడ్, బాలవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!