శ్రీరంగపూర్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: శ్రీరంగపూర్ పట్టణంలో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులు గా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ లు ఆర్పింఛారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సామాజిక సమానత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగపూర్ మండలం గౌడ సంఘం అధ్యక్షులు నర్సన్ గౌడ్,నగరాల గోవర్ధన్ గౌడ్,జానంపేట మేఘనాథ్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు జగనాథం నాయుడు, వెంకటస్వామి సుదర్శన్ రెడ్డి,,వెంకటేశ్వర్ రెడ్డి, పర్వతాలు, మాజీ సర్పంచ్ లు సత్యం యాదవ్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


