పొలిటికల్ పవర్, ఆగస్టు 18:
భద్రాచలం:గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని మరియు 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహా పాదయాత్ర మంగళవారం నాటికి రెండో రోజు పెద్ద నల్లబల్లి గ్రామ ఆదివాసి యువకులు మరియు మాజీ ఎంపీపీ రేసు ఆదిలక్ష్మి మహా పాదయాత్రకి ఘనంగా స్వాగతం పలికి సోంది వీరయ్యకి పూల దండలు వేసి మహా పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోందివీరయ్య మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంలో గోండ్వానా న్యాయ కళాశాల తమ పోరాటాలతోనే సాధించుకుంటామని ఆయన అన్నారు. ఆదివాసి యువత న్యాయ కళాశాలతోనే ఆదివాసి చట్టాలపై జీవోలపై అవగాహన ఉంటుందని ఆయన అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో బూర్జవ రాజకీయ పార్టీలే ఆదివాసి చట్టాలపై దాడులు చేస్తున్నారని ఇది గమనించే అవసరం ఎంతైనా ఉందని ఆదివాసి యువత తలచుకుంటే ఆదివాసి చట్టాల జోలికి ఏ బూర్జవ రాజకీయ పార్టీలు రావని అన్నారు5వ షెడ్యూల్ భూభాగంలో1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు 5వ షెడ్యూల్ భూభాగంలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను ఏజెన్సీ ప్రాంతంలో బొత్తిగనే అమలు కావడం లేదని ఆయన మంది పడ్డారు ఏజెన్సీ ప్రాంతంలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పటిష్టంగా అమలు చేసి ఆదివాసులకు భూములకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతంలో వలస నిరోధిక చట్టం ప్రకారం గా ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేతరులు దౌర్జన్యంగా వచ్చి ఆదివాసుల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం ప్రభుత్వ భూములు దౌర్జన్యంగా అక్రమించుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఆయన అన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసి ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా తీర్మానాలు చేయాలని ఆయన ఈ పాదయాత్ర ద్వారా కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 నీ పునరుద్ధరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 3 ని తక్షణమే చట్టం చేసి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు ఆదివాసులకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 లేకపోవడంతో ఆదివాసి యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని అన్నారు న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని మహా పాదయాత్ర 20న భద్రాచలం ఐటీడీఏ వరకు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ మహా పాదయాత్రకు మద్దతు తెలిపిన వారు. ఆదివాసి సంఘాల పొలిటికల్ జేఏసీ. వాసం రామకృష్ణ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మల్లుదొర ఆదివాసి సంక్షేమ పరిషత్ అభిరామ్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం హరికృష్ణ. టిఆర్ఎస్. కనితి లక్ష్మణ్. ఆదివాసి యువత యువకులు మహిళలు అందరూ సంపూర్ణ మద్దతు తెలిపారు
