ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమానవత్వం చాటుకున్న తాటిపాముల ఉద్యోగులు

మానవత్వం చాటుకున్న తాటిపాముల ఉద్యోగులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 22 2026: నపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన బొయ్య చిన్న అబ్దుల్లా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. భార్య ఒంటరిగా మిగిలిపోవడం, కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో దశదిన కర్మకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ధర్మరాజ్ తదితరులు తాటిపాముల ఉద్యోగుల దృష్టికి తీసుకువచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఉద్యోగులు బొయ్య అంకె ఆంజనేయులు, బొయ్య అంకె రాజు, బొయ్య అంకె వీరాస్వామి, బొయ్య అంకె కురుమూర్తి ముందుకు వచ్చారు. నలుగురు ఉద్యోగులు కలిసి మానవత్వంతో రూ. 12,000/- ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి దశదిన కర్మ నిర్వహణకు ఎంతో కొంత ఉపశమనం కలిగించింది. మానవత్వం చాటుకున్న తాటిపాముల ఉద్యోగులను సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థిక సహకారం అందించిన ఉద్యోగుల సేవా గుణం అందరికీ ఆదర్శమని ఆయన కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలా పేదలను, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మానవత్వమే గొప్పదని, ఇలాంటి చిన్న సహాయాలే పెద్ద భరోసానిస్తాయని శంకర్ గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!