అశ్వారావుపేటలో ఘనంగా విగ్రహ ఆవిష్కరణ
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 24 2026: అశ్వారావుపేట అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వంగవీటి రాధా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వంగవీటి మోహన్ రంగా సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజల పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వంగవీటి రంగా కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి హక్కుల కోసం నిలబడిన ప్రజా నాయకుడని మెచ్చా అన్నారు. విగ్రహ ఆవిష్కరణ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, రంగా ఆశయాలను, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన మార్గాన్ని నేటి తరానికి గుర్తుచేసే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మోహన్ రెడ్డి, సంక ప్రసాద్, చిన్నంశెట్టి నరసింహం, వేదాంతపురం ఉప సర్పంచ్ వీరరాజు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, వార్డు మెంబర్ అలా రాంబాబు, కలపాల బాబురావు, కలపాల సురేష్, చిప్పనపల్లి శ్రీను, నీలం నారాయణ, ఉస్మాన్, ఆసిఫ్, బుజ్జిబాబు, అమీర్, బన్ను, నందికొల్ల సంతోష్, రవీంద్ర, షాయిద్, సత్యానందం, సాయి తదితరులు పాల్గొన్నారు.

