ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్*ప్రొద్దుటూరు లో టీడీపీ కోటకు బీటలు….!*

*ప్రొద్దుటూరు లో టీడీపీ కోటకు బీటలు….!*

📰 Generate e-Paper Clip

*రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ లోకి ముస్లిం మైనారిటీ ల చేరికలు…*


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో కే ప్రతాప్ రెడ్డి
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 22 వ వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ ( లక్ష్మి సౌండ్స్ ) మరియు వారి సోదరులు మరియు బంధుమిత్రులు.

ఈ సందర్బంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ప్రొద్దుటూరులోని 22 వార్డు లో ఎంతో ప్రజా బలం కలిగిన మాబు హుస్సేన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లొకి సాధారంగా ఆహ్వానిస్తున్నామన్నారు. 2011 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వై.యస్.ఆర్.సి.పి కి అండగా నిలిచిన మాజీ కో ఆప్షన్ కటిక జాఫర్ లాంటి వ్యక్తులు ఈ వార్డులో వై.యస్.ఆర్.సి.పి బలానికి ఒక ఉదాహరణ అని, అందరూ కలిసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అభ్యర్థి గెలిచి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికల్లో ఓడినప్పటికి ముస్లిం ప్రజలు నన్ను ఆదరించినందుకు మీ ఋణం తీర్చుకోలేనిదన్నారు. అల్లా దయవల్ల మీ ముస్లిములందరికి పెద్ద కొడుకునై ఉంటానని, మీకు మంచి చేసే వరకు నిష్క్రమించమని మాట ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!