ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎమ్మెల్యే జీఎంఆర్ సూచనలతో కనిమెట్టలో అభివృద్ధి పనులకు వేగం

ఎమ్మెల్యే జీఎంఆర్ సూచనలతో కనిమెట్టలో అభివృద్ధి పనులకు వేగం

📰 Generate e-Paper Clip

రెండో వార్డులో రహదారుల శుభ్రత పనులు.. పర్యవేక్షిస్తున్న వార్డు ప్రజాప్రతినిధులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో అభివృద్ధి పనులు దశలవారీగా చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని అపరిశుభ్రంగా, ముళ్ల పొదలతో నిండిపోయిన రహదారులను శుభ్రం చేసే పనులు చేపట్టారు. రెండో వార్డులో చేపట్టిన ఈ పనులను వార్డు మెంబర్ కానాపురం కొండన్న, మాజీ వార్డు మెంబర్ వాకిటి గణం పరశురాం, వార్డు నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పనులు నాణ్యతతో, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్ల పరిశుభ్రత, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలకు చర్యలు చేపట్టడంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)కు వార్డు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!