ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపామిరెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం

పామిరెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శివాలయం టెంపుల్ వైరాగిరి గుట్ట సమీపంలోని కమ్యూనిటీ ప్లాంటేషన్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కిమ్యా నాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ తరుణ్ చక్రవర్తి, మండల ఎంపీడీఓ పరిణత, ఏపీఓ సురేష్ పాల్గొని మొక్కలు నాటారు. అలాగే వార్డు సభ్యుడు కొంకలి నరేష్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను విరివిగా నాటి వాటిని సంరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!