పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం పట్టణ కేంద్రంలో ప్రముఖ ప్రసూన కార్డియాక్ న్యూరో హాస్పిటల్ శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వసూళ్ల పర్వం బయటకు వచ్చింది ఇటీవల కోదాడ పట్టణానికి చెందిన సోము పొంగు గోపి అనే వ్యక్తి కిడ్నీలో రాళ్లు ఉన్న కారణంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ సర్జరీలో స్టంట్ ఏర్పాటు చేయడం ద్వారా అది రిమూవ్ రిమూవ్ చేయించుకొనుట కొరకు ఈరోజు అనగా 26 తారీకున ప్రసూన హాస్పిటల్ కి వెళ్ళగా ఆరోగ్యశ్రీ వర్తించినప్పటికీ దానికి కావా రిమూవ్ చేయడానికి కావలసిన మెటీరియల్ తీసుకోవాలని నాలుగు జాతుల గ్లౌజులు సర్జరీ కిట్టు మూడు లీటర్ల సోడియం క్లోరైడ్ లిక్విడ్ కలిపి 1400 రూపాయలు బిల్ చేశారు స్టంటు తీసివేసిన అనంతరం బాధితుడు తన వెంట వచ్చిన వారితో చెప్పగా అక్కడే ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు నేరుగా సైదా బాబు యాజమాన్యాన్ని నిలదీయగా హాస్పిటల్ వారు అక్రమంగా పేషెంట్ నుండి కొనిపించిన సామాన్లు మొత్తం తిరిగి కిందకు తీసుకువచ్చి పేషంట్ నుండి వసూలు చేసిన 1400 రూపాయలని పేషెంట్ గోపికి ఇవ్వడం జరిగింది ఈ ఘటనపై వెంటనే ఖమ్మం జిల్లా డి ఎం హెచ్ ఓ కి కాల్ చేసి విషయాన్ని చెప్పగా నా పరిధి కాదు ఆరోగ్యశ్రీ ఇన్చార్జి శ్రీనివాస్ కి తెలపండి అంటూ నిర్లక్ష్య సమాధానాన్ని ఇచ్చారు ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం హాస్పిటల్ కి వస్తే హాస్పిటల్ వారు ఇలాంటి అక్రమ వసూలు చేస్తున్నారని వీటి పై పూర్తి విచారణ జరిపి ప్రసూన హాస్పిటల్ శ్రీ చక్ర హాస్పిటల్ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు, ఈ విషయాన్ని ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నట్లు సైదా బాబు తెలిపారు
హాస్పటల్లో ఆరోగ్యశ్రీ వర్తించినా కూడా ఆగని వసూళ్ల దందా..
RELATED ARTICLES
