ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్"అన్నగా కేటీఆర్‌.. రాఖీ కట్టిన అశ్వారావుపేట ఆడపడుచులు”

“అన్నగా కేటీఆర్‌.. రాఖీ కట్టిన అశ్వారావుపేట ఆడపడుచులు”

📰 Generate e-Paper Clip

రాఖీ పౌర్ణమి వేళ అభిమానాన్ని చాటిన బీఆర్‌ఎస్‌ మహిళలు

పొలిటికల్ పవర్, ఆగస్టు 28: అశ్వారావుపేట : రాఖీ పౌర్ణమి సందర్భంగా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్‌ మహిళల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు అండగా నిలిచే నాయకుడిగా కేటీఆర్‌ను భావిస్తూ రాఖీ కట్టినట్లు మహిళలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్‌ అందించిన సేవలను ఈ సందర్భంగా మహిళలు కొనియాడారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్‌ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, భవిష్యత్తులోనూ ఆయనకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు కాసాని చంద్రమోహన్, భూక్య ప్రసాద్ , జుజ్జురపు శ్రీరామ్‌మూర్తి, సత్యవరపు సంపూర్ణ, తగరం జగన్నాథం, మోటూరి మోహన్, ఆరెపల్లి గోవిందం తదితరులకు బీఆర్‌ఎస్‌ మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు కేటీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ రాఖీ పౌర్ణమి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు కాసాని పద్మ, భూక్య ఉదయజ్యోతి, సాధు జోస్నాబాయితో పాటు పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!