ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటఫీజు బకాయిలపై బీజేవైఎం ధర్నా కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు

ఫీజు బకాయిలపై బీజేవైఎం ధర్నా కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలిపొలిటికల్ పవర్, ఆగస్టు 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా( బీజేవైఎం) ఆధ్వర్యంలో ఫీజులు బకాయి బిజెపి లడాయి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, దీనివల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాల్సి ఉండగా, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకపోవడంతో ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందని స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల విషయంలో ఫీజు బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారిందని ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కోరారు.

“విద్యార్థుల హక్కుల కోసం పోరాటం.. ఫీజు బకాయిల విడుదలే లక్ష్యం” అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేవైఎం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!