ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేట"కార్యకర్తకు కష్టం.. తాటి అండ”

“కార్యకర్తకు కష్టం.. తాటి అండ”

📰 Generate e-Paper Clip

చిలకరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు – నారాయణపురంలో ఘన స్వాగతం

అశ్వారావుపేట, పొలిటికల్ పవర్ ఆగస్టు 29:అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పులగడప చిలకరావును బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్‌–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగి గాయపడిన చిలకరావు ఖమ్మంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న తాటి వెంకటేశ్వర్లు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిలకరావు గాయాన్ని పరిశీలించిన తాటి వెంకటేశ్వర్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పండ్లు అందజేసి ధైర్యం చెప్పారు. చిలకరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, కష్టకాలంలో అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

తాటికి ఘన స్వాగతం.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి

తాటి వెంకటేశ్వర్లు నారాయణపురం గ్రామానికి చేరుకోగానే స్థానిక నాయకులు జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తాటి రాకను తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, జుజ్జూరపు శ్రీరామ్మూర్తి, గుడవర్తి వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, ఆరేపల్లి గోవింద్, శెట్టిపల్లి రఘురాం, పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి నారం అనురాధ, వార్డు సభ్యురాలు కనకమ్మ, తోడేం అనురాధ, జక్కుల నాగమణి, అల్లం సీతారాములు, కౌవులూరి నరేష్, కాటూరి నాగు, యాదిరాజు దుర్గారావు, జక్కుల సందీప్, శానంపూడి వెంకన్నబాబు, జక్కుల సుధీర్, పల్లెల వెంకన్న, ఇట్టా సందీప్, కోట సింహాచలం, అల్లం ఎల్లయ్య, మారుతి కృష్ణ, పులగడప దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!