ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

న్యూలక్ష్మీపురంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

న్యూలక్ష్మీపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా న్యూలక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన చేసిన సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ శ్రీ వాకదాని కన్నయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె పొంగు రమేష్, మాజీ మండల సేవా అధ్యక్షులు ఊరుకొండ రాజు, మాజీ ఉపసర్పంచ్ పల్లె పొంగు మైసయ్య సీనియర్ నాయకులు గడ్డం బాబు, మహమ్మద్ జాఫర్, కొట్టి శ్రీనివాసరావు, కొట్టి శ్రీరాములు, వాకదాని చెన్నారావు, సయ్యద్ నాగుల్ మీరా బట్టు బసవయ్య, కన్నోజు నాగ చారి చెరుకూరి నాగేశ్వరరావు, బర్ల రాంబాబు, వాకధాని రాంబాబు మల్ల నరసింహారావు షేక్ టిల్లు ఇజ్జహర్ వాగదాని, సందీప్ పేరం గోపి, బాణాల దుర్గాప్రసాద్, యలమద్ది ప్రశాంత్, అల్లాడి వెంకన్న, మహమ్మద్ నజీర్, షేక్ ఆసిఫ్, ఎలగందుల గోపి, మారుతి సురేష్, ఊరుకొండ అభిషేక్, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!