ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణమహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ...

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు డప్పు రాజు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ సెప్టెంబర్ 02,2026: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ లో ఉన్న వైస్సార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో “ప్రజలే నా కుటుంబం” అనే భావనతో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేసిన మహానేత వైయస్సార్. రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంతింటి కల ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు అనేక పథకాలు వైయస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయనను ప్రజలు నేటికీ “మహానేత”గా ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!