ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు వీ హబ్ ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం చక్కటి అవకాశం  అదనపు...

మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు వీ హబ్ ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం చక్కటి అవకాశం  అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.సెప్టెంబర్.03.2026.మహిళలుపారిశ్రామిక రంగంలో రాణించిఆర్థికంగాస్వావలంబన సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు,ప్రోత్సాహకాలనుసద్వినియోగంచేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)ఖిమ్యానాయక్ సూచించారు.బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ సమావేశమందిరంలోతెలంగాణప్రభుత్వఐటీ,ఎలక్ట్రానిక్స్‌అండ్‌,కమ్యూనికేషన్స్‌,శాఖఆధ్వర్యంలోని వి-హబ్‌ సౌజన్యంతో మహిళా స్వయం సహాయక సంఘాలసభ్యులు,మహిళాఔత్సాహికపారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరైమహిళాపారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక రంగంలోరాణించిఆర్థికంగాస్వావలంబనసాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ చక్కటి అవకాశమని తెలిపారు. ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్‌ సహకారం, ఇతర ప్రోత్సాహకాలను వినియోగించుకొని తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ అవకాశాలను సృష్టించుకోవాలని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.వీ హబ్ సీనియర్ డైరెక్టర్ జాహీద్ అక్తర్ షేక్,డైరెక్టర్.ఊహమాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలను మరింత వేగంగాఅభివృద్ధి చేయడం,వాటిసామర్థ్యాన్నిపెంపొందించడంజరిగిందని ఈకార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంకిందఎంపికైనమహిళాపారిశ్రామికవేత్తలకు ప్రత్యేక శిక్షణ,మార్గదర్శకత్వం,అవసరమైనసహకారం అందిస్తారని వివరించారు. జౌళి, ఆహారశుద్ధి,తయారీ, చేతివృత్తులు, హస్తకళలు తదితరరంగాల్లోనివ్యాపార సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తారని తెలిపారు.వ్యాపార నిర్వహణ నైపుణ్యాల పెంపు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, కొత్త ఉత్పత్తుల రూపకల్పన, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ వంటి అంశాల్లో అవసరమైన సహకారం అందిస్తారని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణ అనుసంధానం కల్పించడంతో పాటు వివిధరంగాలకు చెందిన నిపుణులతో వ్యక్తిగత మెంటరింగ్‌ అందించి మహిళల వ్యాపారాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తారని తెలిపారు.సదస్సులో స్థానిక మహిళ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఆసక్తి చూపిన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ రామ మహేశ్వర్, ఆర్ సెటి డైరెక్టర్ అనిల్, అడిషనల్ డి ఆర్ డి ఓ, సంబంధిత శాఖల అధికారులు, వి-హబ్‌ ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!