మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర మండలం : నాగారం : నాగారం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 5 లోని సెయింట్ మేరీస్ బెతాని కాన్వెంట్ విద్యాలయం సమీపంలో ఉన్న ఈ ప్రమాదకర గుంతలు ఒక ఉదాహరణ మాత్రమే. నాగారం మొత్తం ఇదే పరిస్థితి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్రమాదకర గుంతలు. రోజూ వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు ఈ రోడ్లపై ప్రయాణిస్తున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. అయోమయం లో నాగారం ప్రజలు. మల్లారెడ్డి గారూ… నాగారం ప్రజల సూటి ప్రశ్న?. డాన్స్‌లు చేయడానికి మీకు సమయం ఉంది…కానీ, రాజకీయ కార్యక్రమాలకు సమయం ఉంది…కానీ, ప్రచారాలకు సమయం ఉంది… కానీ, నాగారం ప్రజల సమస్యలను చూడటానికి మాత్రం సమయం లేదా? మీకు. నాగారం మొత్తం ప్రమాదకర గుంతలతో నిండిపోయి ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఒక్కసారి కూడా వచ్చి పరిశీలించకపోవడం చాలా సిగ్గు చేటు ? అని ప్రశ్నిస్తున్న ప్రజలు. ప్రజలు ఎన్నిసార్లు చెప్పాలి?, ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇవ్వాలి?. ఇంకెంత మంది గుంతల్లో పడి ప్రమాదాలకు గురైతే ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందిస్తారు?. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడి బాధ్యత ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు కదా? కనీసం మా వైపు చూడటం లేదని నాగారం ప్రజలు వాపోతున్నారు. ఒక్కసారి నాగారం మొత్తం తిరిగి చూడండి, ప్రధాన రోడ్లు చూడండి, కాలనీ రోడ్లు చూడండి, స్కూల్స్ పరిసరాలు చూడండి. నాగారం ప్రజల పరిస్థితి మీకే అర్థమవుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోని పరిస్థితిలో మేము మా గోడు ఎవరికీ చెప్పుకోవాలి అని మోర పెట్టుకుంటున్నారు. సెయింట్ మేరీస్ బెతాని కాన్వెంట్ విద్యాలయం దగ్గర ప్రమాదకరంగా ఉన్న గుంతలను సొంత ఖర్చుతో మట్టి తెప్పించి పూడ్చే ప్రయత్నం చేసిన డివిజన్ ప్రజలు. ప్రజల సమస్యలపై పాలకులు స్పందించాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం. ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ : నాగారం మొత్తం రోడ్లను తక్షణమే పరిశీలించి, ప్రమాదకర గుంతలను వెంటనే పూడ్చాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.
మల్లారెడ్డి గారూ… డాన్స్‌లకు సమయం ఉన్న మీకు… నాగారం ప్రజల ప్రాణాలను కాపాడే రోడ్లను చూడటానికి సమయం ఎందుకు లేదు?. ప్రజల మధ్యకు వచ్చి మా సమస్యలు పరిష్కరించండి!.
