పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్ గణేష్ ఆగమనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వివేకానంద నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఆహ్వానించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ గణేష్ విగ్రహాన్ని ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో టీమ్ భైరవ్ సభ్యులు,లోకేష్ రెడ్డి, బాబీ,కృష్ణకాంత్, రోషిక్ రావ్,రామన్,త్రిషిత్,మరియు యువత, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్వాహకులు కోరారు.
