ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రజాకవి కాళోజి నారాయణరావు ఆశయాలను కొనసాగించాలి— ఐక్య విద్యార్థి సంఘాలు

సెప్టెంబర్ 9 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని.

మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహం లో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.*ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ…ప్రజా కవి కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, అన్యాయాలను ఎత్తిచూపారని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజల్లో చైతన్యం కలిగించిన ఆయన సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాళోజి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు, యువత సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం తో పాటు ప్రజా చైతన్య దినోత్సవంగా నిర్వహించాలని, ఆయన సాహిత్యాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పూరెళ్ల నీతిష్,బచ్చలి అభిరామ్,గార కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!