ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
HomeతెలంగాణKCR హత్యకు కుట్ర జరిగిందంటూ BRS నాయకుల ఫిర్యాదు

KCR హత్యకు కుట్ర జరిగిందంటూ BRS నాయకుల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా డెస్క్ ఎన్నికలలో ప్రకటించిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజా గొంతుకై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులను అడుగడుగునా అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడమే సిగ్గుచేటు అని ప్రజలు భావిస్తుంటే ఎన్ని కుట్రలు పన్నిన ప్రశ్నించే గొంతు ఆగడం లేదని తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 10 ఏండ్లు ముఖ్యమంత్రి గా చేసిన కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకొని అసెంబ్లీ సాక్షిగా ఒక్కకడిని గుడ్డలుడాదీసి తంతా అని అనేక రకాలైన ద్వేష పూరిత మాటలు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ నే చంపించాలనే దురుద్దేశంతో నిన్న ఫామ్ హౌస్ మీదకి 500 వందలమందిని పంపించిన ఈ కాంగ్రెస్ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చిన అశ్వారావుపేట మండల కో ఆర్డినేటర్ జూపల్లి.రమణ రావు మరియు మండల నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం సెప్టెంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల BRS పార్టీ కో ఆర్డినేటర్ జూపల్లి.రమణ రావు మరియు మండల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 8న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో, KCRను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందని ఫిర్యాదులో ఆరోపించారు.షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు ఇతరుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి,సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పెద్ద సంఖ్యలో వాహనాలతో కొందరు వ్యక్తులు వెళ్లడం,అనంతరం KCRకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో రావడం వంటి అంశాలను పోలీసులు పరిశీలించాలని BRS నాయకులు కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, KCR భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన వారిపై హత్యాయత్నం సహా తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. “ప్రజానాయకుడైన KCR భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలి”అని BRS నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ జూపల్లి.రమణ రావు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి,మాజీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావుమాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్, మాజీ సొసైటీ డైరెక్టర్ కలపాల బాబురావు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, చిప్పనపల్లి శ్రీను, బుజ్జిబాబు రెహ్మాన్, సంతోష్, బన్ను, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!