ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

చిట్యాల బీసీ బాలుర జూనియర్ కళాశాలకు రూ.10 కోట్ల నిధులు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: నపర్తి మండలం చిట్యాలలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWR) బాలుర జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ G.O.Rt.No.93, తేదీ 16-07-2026 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వనపర్తి నియోజకవర్గంలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న MJPTBCWR బాలుర పాఠశాల ప్రాంగణంలోని స్థలంలో నూతన జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. భవన నిర్మాణ పనులను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) ద్వారా చేపట్టేందుకు 05-09-2026న ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యను మరింత సౌకర్యవంతంగా అభ్యసించే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ వసతులు విద్యార్థులను ఉన్నత విద్య వైపు మరింత ప్రోత్సహిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి లకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!