ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారంలో నాణ్యతా లోపం.. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైనం..

📰 Generate e-Paper Clip

  1. *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి

    * గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఇస్తున్న కోడిగుడ్లు నాసిరకం.

  2.  * చిన్న సైజులో, కుళ్ళిన వాసన వస్తున్న గుడ్లు.
  3.  * అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ల అడ్డగోలు తతంగం.
  4.  * ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు, తల్లిదండ్రులు
  5. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, మరియు లేత వయస్సు గల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సరఫరా  చేస్తున్న కోడిగుడ్లు తీవ్ర నాసిరకంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయ  క్షేత్రస్థాయిలో అనేక అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని గుడ్లు సాధారణ పరిమాణం కంటే చాలా చిన్నవిగా ఉండగా, మరికొన్ని కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నాయి. పౌష్టికాహారం ద్వారా అందాల్సిన పోషకాలు అటుంచితే, ఈ నాసిరకం గుడ్లను తింటే పిల్లలు, బాలింతలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల ఉదాసీనతపై విమర్శలు: నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు నాణ్యమైన, నిర్దేశిత బరువు కలిగిన తాజా గుడ్లను మాత్రమే అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేయాలి. అయితే, క్షేత్రస్థాయిలో అధికారులు సరైన పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేంద్రాలకు చేరిన గుడ్లలో పది నుంచి ఇరవై శాతం వరకు పగిలిపోవడం లేదా పాడైపోవడం జరుగుతున్నట్లు సమాచారం ప్రజల, నిపుణుల డిమాండ్:చిన్నారులు మరియు బాలింతల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సంబంధిత కాంట్రాక్టర్లపై మరియు ఈ విషయాలను పట్టించుకోని అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పకడ్బందీ తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest Articles

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత   సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్...

Related Articles

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్ లేదా వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్లో ఎలాంటి అనుమతులు లేవుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య కోమలిపై దాడి //పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక & పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి...
error: Content is protected !!