ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

📰 Generate e-Paper Clip

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్ లేదా వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్లో ఎలాంటి అనుమతులు లేవు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

దోర్నాల మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించే విషయంలో ప్రజలు, భక్తులు మరియు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ సూచించారు. దోర్నాల మండల పరిధిలోని వెలుగండ ఫీడర్ కెనాల్లో గానీ, వెలుగండ ప్రాజెక్ట్ టన్నెల్లో గానీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అధికారిక అనుమతులు లేవు   ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి లేని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడం వల్ల,ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నందున నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరుతున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు సూచించిన మరియు అనుమతి కలిగిన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించవలసినదిగా కోరినారు.

Latest Articles

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత   సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య...

Related Articles

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య కోమలిపై దాడి //పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక & పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి...
error: Content is protected !!