ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

📰 Generate e-Paper Clip

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో

రాజకీయ పలుకుబడితో భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకుని, భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుల దౌర్జన్య పూరిత ఆక్రమణలకు వ్యతిరేకంగా శనివారం ఉదయం కాశినాయన మండల పరిధిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉధృత భూపోరాటం నిర్వహించారు. నాయనపల్లె, వరి కుంట్ల గ్రామాలకు చెందిన వందలాది మంది పేదలు, వ్యవసాయ కార్మికులు ఎర్రజెండాలు చేతబూని ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ పోరాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎం. బడి పోలయ్య మాట్లాడుతూ.. కాశినాయన మండల పరిధిలోని నాయనపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్లు 129, 130, 131, 219, 217లలో ఉన్న దాదాపు 1200 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను రాజకీయ పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న పేదలను అన్యాయంగా, బలవంతంగా బయటకు నెట్టేసి ఈ భూములను హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ, ఈ భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో కానీ, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కానీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు. వరికుంట, నాయనపల్లె గ్రామాలకు చెందిన పేదలు తమకు న్యాయం చేయాలని కోరుతూ గతంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), ఆర్డీఓతో పాటు కాశినాయన మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలుమార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన నిరుపేదలకు గత్యంతరం లేని పరిస్థితిలోనే వ్యవసాయ కార్మిక సంఘం అండతో ఈ భూపోరాటానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని నాయకులు స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ తక్షణమే స్పందించి సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలైన నాయనపల్లె, వరికుంట్ల గ్రామ ప్రజలకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసి, సాగు హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూపంపిణీ చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ భూపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వరికుంట్ల బాబు, నాయకులు ప్రభాకర్, లక్ష్మయ్య, దాస్, హుస్సేన్, పీరయ్యతో పాటు నాయనపల్లె, వరికుంట్ల గ్రామాల వ్యవసాయ కార్మికులు, నిరుపేద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి◆ రూ. 900 కోట్ల గురుకుల విద్యాలయాల అక్రమాలపై...
error: Content is protected !!