పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలంలో పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించారు
మండలంలోని కొత్తూరు గ్రామంలో కోర్స దాసు అలాగే పార్కలగండి గ్రామంలో కాక ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారి నివాసాలకు స్వయంగా వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అండగా ఉంటామని భరోసాఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్ కొమరం సుశీల, మాజీ సర్పంచ్ మొగిలి కృష్ణ , మాజీ ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య , యలమంచి చంద్రశేఖర్ రావు , శ్రీరాముల చక్రధర్ రావు , సున్నం నరేంద్ర , కొండ్రు రంగ , పద్దం అశోక్ , కొమరం శివ , వెంకటేష్ , వంశీ , శెట్టిపల్లి వంశీ , కుర్సం అనిల్ , కొండ్రు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

