పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: తన పాటల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కెరటం, గాయకుడు స్వర్గీయ సాయిచంద్ అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ టి ఆర్ లలిత కళా తోరణంలో సాయిచంద్ 43వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ధూమ్ ధామ్ కార్యక్రమాలలో తన మాట పాట, ఆటల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్ అని చెప్పారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అతడు అందించిన సేవలు అభినందనీయం అని శంకర్ గౌడ్ కొనియాడారు. అతని మాటలు పాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని శంకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు జనజ్వాల, బైరోజు చంద్ర శేఖర్, దేశి రాములు యాదవ్, బండారు శ్రీనివాస్,డా. గంధం నాగరాజు,డా.శ్యాం సుందర్,బొజ్జిబాబు,తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

