ePaper
Monday, September 21, 2026
📄 ePaper

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

📰 Generate e-Paper Clip

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు

పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య టవర్లకు మార్చే ప్రయత్నాలపై విమర్శలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్‌ 21 2026: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఐఎల్‌టీపీ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ) పేరుతో విలువైన భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపన్‌పల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి తొలుత సుమారు 45 ఎకరాల భూమి ఉండగా, పరిశ్రమ విస్తరణ కోసం అప్పటి ప్రభుత్వం మరో 53.14 ఎకరాలను భూసేకరణ ద్వారా కేటాయించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఫ్యాక్టరీకి సంబంధించిన భూముల విస్తీర్ణం సుమారు 98.14 ఎకరాలకు చేరినట్లు సమాచారం. అప్పటి కేటాయింపుల్లో పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే భూమిని వినియోగించాలనే షరతులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే ప్రభుత్వానికి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు ‘సనద్‌’లో పేర్కొన్నట్లు నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందని, ఎకరా సుమారు రూ.200 కోట్ల వరకు ఉండవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన 53.14 ఎకరాల విలువ రూ.10 వేల కోట్లకు పైగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఐఎల్‌టీపీ కింద హైదరాబాద్‌ పరిధిలోని అర్హత కలిగిన పారిశ్రామిక భూములను మల్టీ-యూజ్‌ జోన్‌లుగా మార్చేందుకు ప్రభుత్వం 2025లో విధానాన్ని తీసుకొచ్చింది. 2026లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి దరఖాస్తుల స్వీకరణకు పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములను కూడా హెచ్‌ఐఎల్‌టీపీ కింద క్రమబద్ధీకరించి నివాస, వాణిజ్య అభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. భూముల్లో భారీ రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ టవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగినట్లు కూడా కథనాలు పేర్కొన్నాయి.

Latest Articles

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్...

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్...

Related Articles

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి జూరాల ప్రాజెక్టు...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 2000మందివిద్యార్తి,విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.22.2026.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు డా. సతీష్‌ యాదవ్‌...
error: Content is protected !!