

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
పాల్వంచ మండలం కరకావాగు గ్రామంలో నివాసం ఉంటున్న MD. ముబీన్ గారి ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి తీవ్ర నష్టం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ N. సురేష్ రెడ్డి , బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణ సహాయంగా ₹25,000/- ఆర్థిక సహాయాన్ని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు.
అలాగే బాధిత కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించిన N. సురేష్ రెడ్డి రానున్న రోజుల్లో వారికీ అన్ని విధాలుగా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సభ్యులు V. రామకృష్ణ రెడ్డి, P. వెంకటేశ్వర రెడ్డి, KS. రామకృష్ణ, 100 శ్రీను, పాషా, T. సంతోష్ రెడ్డి, P. రామ్మోహన్ రెడ్డి, P. జీవన్ రెడ్డి, P. వినయ్ రెడ్డి, బాబులాల్, లక్ష్మణ్, శరత్, కోరెం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🤝 ఆపదలో ఉన్న మా కుటుంబాలకు అండగా నిలిచి N. సురేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన ఎండీ ముబీన్ గారి కుటుంబం

