–మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో మద్దిగట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ రాములు యాదవ్ అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వార్డు సభ్యులందరూ సమన్వయంతో సహకరిస్తే ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.గ్రామంలో వీధిలైట్ల సమస్యను పరిష్కరించడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి ప్రజలు, వార్డు సభ్యులు, అధికారులు సమష్టిగా సహకరించాలని సర్పంచ్ రాములు యాదవ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి సాగర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


