ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

బీఆర్ఎస్‌ నాయకులు మీ ఉనికి చాటుకోవడం కోసం జూరాల గేట్ల వద్ద చిల్లర రాజకీయాలు చేయడం మానండి !

📰 Generate e-Paper Clip

– పదేళ్లు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలా ఎమ్మెల్యే జి యం ఆర్,

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.23.2026.జూరాల నీటి అంశాన్ని రాజకీయంగా మార్చి రైతులను రెచ్చగొట్టడం బీఆర్ఎస్‌, బీజేపీనేతలుమానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్‌రెడ్డి  హితవు పలికారు. రైతుల సాగునీటి అవసరాలతో పాటు ప్రజల తాగునీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంనిర్ణయాలుతీసుకుంటోందనితెలిపారు.రాష్ట్రంలో ప్రస్తుత నీటి కొరతకు గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, దూరదృష్టిలోపమేకారణమనిఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతోవర్షాభావపరిస్థితులునెలకొనడం, ఎగువ నుంచి వరద ప్రవాహాలు లేకపోవడం తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. పంటలకు నీరు ఎంత అవసరమో ప్రజలకు తాగునీరు కూడా అంతే అవసరమని పేర్కొన్నారు.కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను గతంలో సుమారు 30. శాతం నుంచి 43. శాతం వరకు పెంచే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషిచేసిందని  తెలిపారు.రాష్ట్రహక్కులకోసంముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డినాయకత్వంలోనిప్రజాప్రభుత్వంకేంద్రంతోపోరాడుతోందన్నారు.జూరాల వద్ద పదేళ్లలో అదనపు నిల్వ సామర్థ్యం పెంచకుండా, ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచకుండా బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం జూరాలలో సుమారు మూడు టీఎంసీల మేర పూడిక ఉందని, తాగునీటి అవసరాల కోసం నీటిని అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి ఉందన్నారు.

పాలమూరు–రంగారెడ్డిపై తప్పుడు ప్రచారం వద్దు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్‌ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిందని, ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించిందని కేటీఆర్‌ చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని  అన్నారు. ప్రాజెక్టు నిజంగా అంతమేర పూర్తయితే ప్రస్తుత సాగునీటి ఇబ్బందులకు కారణమేంటో బీఆర్ఎస్‌ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.జూరాల గేట్ల వద్ద రాజకీయ ప్రదర్శనలు చేయడం కాకుండా రైతులకు, ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, నీటి కొరత పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Latest Articles

🔸ఏదులాపురం రెవిన్యూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీ

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

పాత కక్షలతో గొడవపడి గాయపరిచిన వ్యక్తి అరెస్టు కోర్టుకు రిమాండ్ టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ అమూల్య

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి టేకుమట్ల//టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి...

Related Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

-పలుస శంకర్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22,2026: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందని,...

సార్ ప్రక్రియతో 43.98 లక్షల ఓట్లపై ఉత్కంఠ

నోటీసులు అందుకున్న వారిలో 53.62 శాతం మంది విచారణకు గైర్హాజరు కొడంగల్‌లో 96 శాతం మంది స్పందించని పరిస్థితిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ...

ఎమ్మెల్యే సహకారంతో మద్దిగట్లను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

  --మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో...
error: Content is protected !!