ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి, వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను.ఆదేశించారు.

📰 Generate e-Paper Clip

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి.భూపాలపల్లి //
కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో మంగళవారం ఆయన రెవెన్యూ, పోలీస్, అటవీ,
దేవాదాయ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్తు, ఆర్ డబ్ల్యూ ఎఎస్, ఆర్టీసీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. దేవుడి నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణతో పాటు ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కోరారు. పనుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్‌ అధికారులు కాళేశ్వరంలోనే ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పురోగతిని కాటారం సబ్‌ కలెక్టర్‌ గౌరవ్‌ శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన సమన్వయం చేయాలని సూచించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అంతరం ఈఓ కార్యాలయంలో వివిధ శాఖల ద్వారా చేపట్టనున్న పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్,
గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం,
దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతి రాజ్, విద్యుత్, ఆర్ అండ్ బి, ప్రణాళిక, ఆర్కి టెక్చర్ సూర్య నారాయణ మూర్తి, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

🔸ఏదులాపురం రెవిన్యూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీ

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

పాత కక్షలతో గొడవపడి గాయపరిచిన వ్యక్తి అరెస్టు కోర్టుకు రిమాండ్ టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ అమూల్య

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి టేకుమట్ల//టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి...

Related Articles

గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని అన్నదానం చేసిన చల్లా కృష్ణన్న! 🚩 🌺 భక్తిశ్రద్ధలతో వినాయకునికి ప్రత్యేక పూజలు

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ రోడ్ నంబర్ 2లో...

చిట్యాల.నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.సతీష్ ను. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమి చ్చిసత్కరించిన ఆర్టిఐ కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి భూపాలపల్లి //22:-9:-జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్, గా బాధ్యతలు చేపట్టిన వై సతీష్ కు...

ఎన్నికలు మనకేం కొత్త కాదు.. ఫైట్ చేయడం మనకేం కొత్త కాదు

ప్రజల గుండెల్లో ఉన్నాం.. ఖచ్చితంగా గెలిచి మన సత్తా చూపిస్తాం: దానం నాగేందర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ...
error: Content is protected !!