అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించిన
ఎస్ ఈ .రాజేశ్వర్….
పొలిటికల్ పవర్ ఎన్విఆర్టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో…
రుద్రూరు మండల కేంద్రంలోని
అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ మూడు మెగావాట్లును ఎస్ ఈ రాజేశ్వర్ చేతులమీదుగా ప్రారంభించారు. ప్రారంభించిన సోలార్ ప్లాంట్. గురించి ఎస్సీ రాజేశ్వర మాట్లాడుతూ.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన అనేది దేశంలోని కోటి గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుతమైన రూఫ్‌టాప్ సోలార్ పథకం. ఈ గ్రామంలోని మూడు మెగావాట్లను సోలార్ ప్లాంట్ నుండి తయారు చేసుకోవడం జరుగుతుంది. అని అన్నారు వ్యవసాయ పద్ధతికి కూడా వాడుకోవచ్చు.ఈ పథకం కింద మీ ఇంటి పైకప్పు (రూఫ్‌టాప్) పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీగా ఆర్థిక సబ్సిడీని అందిస్తుంది.అలాగే ముందస్తుగా ఆలోచనతోనే, (ఏ లి నా) ప్రభావంతో వ్యవసాయానికి 24 గంటలు సోలార్ ప్లాంట్ నుండి విద్యుత్తును వాడుకోవచ్చని వివరంగా వివరించారు.
మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిన అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు (ప్రభుత్వానికి) విక్రయించడం ద్వారా నెలనెలా ఆదాయం కూడా సంపాదించవచ్చు. అనీ ఒక ప్రకటనలో తెలిపాడు. తదుపరి గ్రామంలోని విద్యుత్తు బకాయిలు ఉన్న వారి దగ్గర కలెక్షన్ చేసి విద్యుత్ సంస్థకు లాభాలు బాటలో
నడిపించిన అంబం (ఆర్ )లైన్మెన్ రామకృష్ణకు, రాకేష్ కు ఎస్ ఈ రాజేశ్వర్ చేతులు మీదుగా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ రాజేశ్వర్, డి ఈ టి వెంకటరమణ, డి ఈ ముక్తర్, ఏ డి ఈ నవీన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు,ఏ ఈ శ్రీనివాస్,ఎస్ ఎల్ ఐ శ్రీనివాస్, ఎల్ ఐ రాజేశం,
లైన్మెన్లు రామకృష్ణ, షబిల్, రాకేష్,ఆపరేటర్స్, గ్రామ సర్పంచ్ గంగాధర్,శానం గంగాధర్,కపిల్,ఉదయ్, గ్రామ ప్రజలు,మొదలగు తదితరులు పాల్గొన్నారు.

