*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.*
*2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.*
*3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.*
*4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు లైనమన్ కి మరియు కరెంటు ఆఫీసుకి తెలియచేయవలెను.*
*5.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.*
*6.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..*
*7.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.*
*8.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.*
*9.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.*
*10.మీ ఇల్లు లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు..*
*11.గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.*
*12.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.*
*13.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను.*
*14.వర్షం పడుచున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను,లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.*
*15.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు. *ఉరుములు, మెరుపులు పిడుగులు వలన ప్రమాదాలు జరగవచ్చును.
*16.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో ఆ ఊరికి సంబంధించిన, మీ ఊరులో ఉన్న, దగ్గర లో ఉన్న, అధికారి అయినా JLM, ALM,LM, LI, sub station, AE లేదా 1912 దృష్టికి తీసుకెళ్లాలి.*విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

