ePaper
Friday, September 25, 2026
📄 ePaper

పిడుగుపాటుకు మృతి చెందిన లక్ష్మికి చిన్నారెడ్డి నివాళులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: పెబ్బేరు మండలం సుగూరు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఏరియా హాస్పిటల్ కు చేరుకుని లక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్ష్మి మృతి పట్ల చిన్నారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. లక్ష్మి మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నివాళులర్పించిన వాళ్ళు వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, సుగూరు గ్రామ మాజీ సర్పంచి రాజశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు ద్వార పోగు విజయబాబు, సిరివాటి సురేష్, గ్రామస్తులు ఉన్నారు.

Latest Articles

బలభద్రపురంలో పంట పొలాలకు తుపాను దెబ్బ

 ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి –...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి..

గుడిసెలు లేని వనపర్తి జిల్లా లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు  మొదటి విడతలో ఇంటి నిర్మాణం ప్రారంభించుకొని వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఒకేసారి బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి వనపర్తి...

అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.

హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026:...

మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...
error: Content is protected !!